Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈవీఎం గోదాముల వద్ద బందోబస్తు నిర్వహించాలి: కలెక్టర్

ఈవీఎం గోదాముల వద్ద బందోబస్తు నిర్వహించాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
మంగళవారం  జిల్లా కలెక్టర్  ఆశిష్ సంగ్వాన్ జిల్లా కేంద్రంలో గల ఈవీఎం గోదామును  జిల్లా అదనపు  కలెక్టర్ ( రెవెన్యూ ) విక్టర్ తో కలిసి సందర్శించి ఈవీఎంలను భద్రపరిచిన గదుల వద్ద రక్షణ చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ..  కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా మంగళవారం ఇవిఏం గోడౌన్ ను సందర్శించి రక్షణ చర్యలను పరిశీలించడం జరిగిందని అన్నారు. ఈవీఎం  గోడౌన్లో సిసి కెమెరాలు 24 గంటలు పని చేసేలా చూడాలని, ఇసిఐ మార్గదర్శకాలు ప్రకారం నిరంతరం బందోబస్తు నిర్వహించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో  కామారెడ్డి తాసిల్దార్ జనార్ధన్, ఎలక్షన్ డిటి  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -