Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీడ్ పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి 

సీడ్ పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి 

- Advertisement -

జిల్లా కలెక్టర్ కి రైతుల పక్షాన వినతిపత్రం 
నవతెలంగాణ – జోగులంబ గద్వాల

భారీ వర్షాల కారణం గా సరైన పంటలు దిగుబడి రకా సీడ్ ఆర్గనైజర్లు పెట్టుబడి పైసలు ఇవ్వక పోవడం తో బయట అప్పులు తెచ్చుకొని పెట్టుబడి పెట్టి నష్టపోయారని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బుధవారం జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ కు వివిధ ప్రజా సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ ఏడాది కూలీల రేట్లు కూడా చాలా దారుణం గా పెరిగి పోవడం తో రైతులు అప్పుల పాలు అయ్యారన్నారు.

ఆర్గనైజర్లు ప్యాకెట్ (పూత,పూత) కు ఈ సారి రూ.450 మాత్రమే ఇస్తామని కంపిణీ  చెపుతున్నారని, చావు కబురు చల్లా గా చెపుతున్నారు. ఇలా అయితే రైతు కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుంది, కాబట్టి  గత సంవత్సరం మాదిరిగానే ప్యాకెట్ కు రూ.550  ఇచ్చే విదంగా తగు చర్యలు తీసుకొని, రైతుల కు ఇవ్వాల్సిన పంటల పైసలు ఎప్పటి లాగానే జులై నెల లో ఇచ్చే లా ఆదేశాలు ఇచ్చి రైతుల కు న్యాయం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమం లో నాగర్ దొడ్డి వెంకట్రాములు, నాయకులు ఐజ రాజు, కుర్వ పల్లయ్య, వివి నరసింహ, బలీగేరి ఏసన్న, బింగిదొడ్డి నాగేష్, కిరణ్, చిన్న యాదవ్, రామకృష్ణ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -