– జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
నవతెలంగాణ – కామారెడ్డి
2025 సంవత్సరం ఖరీఫ్ సాగుకు విత్తనాలను, ఎరువులను రైతులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, డిఆర్డిఓ ఏపీఓలతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష ప్రారంభిస్తూ వ్యవసాయ శాఖ చేస్తున్న పథకాలపై ఆరా తీయడం జరిగింది. జిల్లా వ్యవసాయ అధికారి ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ 2025 కు సంబంధించి వివరాలను కలెక్టర్ కి విన్నవించారు. జిల్లాలో దాదాపు 5 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా వరి 318,000 ఎకరాల్లో సోయా 84000 ఎకరాల్లో ప్రతి 34,000 ఎకరాల్లో కంది 21 ఎకరాల్లో మక్కా 50,000 ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా తో వాటికి సంబంధించిన విత్తనాలు అలాగే ఎరువులు పురుగుమందులు లభ్యత అవసరం అనే విషయాలపై కలెక్టర్ కు విన్నవించారు.
కలెక్టర్ రివ్యూ ప్రారంభిస్తూ విత్తనాలు అలాగే ఎరువులు సరిపడ అందుబాటులో ఉంచాలని అలాగే నకిలీ విత్తనాలు జిల్లాలో ఉండకుండా చూడాలని, పోలీస్ శాఖ, వ్యవసాయ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ టీమ్స్ ప్రతిరోజు తనిఖీలు చేసి ఈ సీజన్లో ప్రత్యేకంగా ప్రతి ఎక్కువగా సాగు చేసే బిచ్కుంద డివిజన్లో ఎక్కువ తనిఖీలు చేపట్టి సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని, జిల్లాను నకిలీ విత్తనరహిత జిల్లాగా ఉంచాలని నిర్దేశించడం జరిగింది. అలాగే రైతు బీమా గురించి రివ్యూ చేస్తూ రైతు బీమా పూర్ పెర్ఫార్మెన్స్ ఉన్న మండలాలు పెద్ద కొదప్గల్ డెత్ రికార్డింగ్ చేయదానికినిఎక్కువ రోజులు ,డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయదానికి ఎక్కువ రోజులు అవడం వల్ల సంబంధిత డీటెయిల్స్ అడిగి పెర్ఫార్మన్స్ సరిగా లేకపోతే చర్యలు తీసుకోవాలని నిర్దేశించడం జరిగింది. అలాగే మొన్న మార్చి నుంచి ఇప్పటివరకు జరిగిన అధికవర్షాలు వడగళ్ల వనాల వలన పంట నష్టం వివరాలు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది.
అవి జిల్లాలో 193 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలియజేయగా అవి వాటి వివరాలు వచ్చిన వెంటనే చర్యలు చేపట్టాలని నిర్దేశించరూ. వ్యవసాయ శాఖ సమీక్ష ముగిసిన వెంటనే హార్టికల్చర్ కి సంబంధించి సమీక్ష ప్రారంభించారు. ఈ సంవత్సరానికి గాను ఆయిల్ ఫామ్ ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలని టార్గెట్ ని మండలాల వారీగా విభజించి వ్యవసాయాధికారి, హార్టికల్చర్ అధికారి అలాగే హిందూస్థాని లివర్ కంపెనీ అధికారి ముగ్గురు సమన్వయంతో ఆ టార్గెట్ ని ఎచీవ్ కావాలనిఆయిల్ పామ్ మొక్కలు 3000 ఎకరాల్లో నాటే విధంగా చర్యలు తీసుకోవాలని దానిపై దిన నివేదికలు సమర్పించాలని ఆర్టికల్చర్ అధికారిని ఆదేశించడం జరిగింది. డిఆర్డిఓ ద్వారా ఆర్టికల్చర్, ఎన్ఆర్ఈజీ అనుసంధానమైన పండ్ల తోటల పెంపకానికి ఉన్న పథకాల వివరాలు తెలియజేయడం జరిగింది. ఇవన్నీ ఏపీఓ , అగ్రికల్చర్ ఆఫీసర్ అలాగే ఆర్టికల్చర్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించరూ. ఫామ్ పాండ్స్ , బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ గురించి అగ్రికల్చర్ ఆఫీసర్స్ అలాగే ఏపీవో సమన్వయంతో రైతుల ఐడెంటిఫికేషన్ చేసి పని ప్రారంభించాలని సూచించరూ.. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి, డిఆర్డిఓ, హార్టికల్చర్ అధికారి జ్యోతి, వ్యవసాయ అసిస్టెంట్, డైరెక్టర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, హార్టికల్చర్ అధికారులు, ఏపీవోలు హిందుస్థాన్ లివర్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.