- Advertisement -
హైదరాబాద్: ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌ఒ) హైదరాబాద్ చాప్టర్ నూతన చైర్‌పర్సన్‌గా సీతారెడ్డి గడ్డం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల నగరంలో జరిగిన కార్యక్రమంలో ప్రతిభా కుంద నుండి ఆమె బాధ్యతలను స్వీకరించారు. పౌల్ట్రీ, విద్య, మైనింగ్, హాస్పిటాలిటీ రంగాలలో విస్తరించిన ఎస్‌ఆర్ గ్రూప్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఉన్న సీతా రెడ్డి ఎఫ్‌ఎల్‌ఒ సిల్వర్ జూబ్లీ ఏడాదిలో ”ఎంగేజ్, ఎంపవర్, ఎలివేట్” అనే నినాదంతో మహిళా సాధికారతకు కృషి చేస్తానని ప్రకటించారు. మరోవైపు ఎఫ్‌ఎఫ్‌ఎల్‌ఒ 21 చైర్‌పర్సన్‌గా ఖుష్బు డాగా బాధ్యతలు స్వీకరించారు.
- Advertisement -



