Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆకుతోటబావితండాలో ఘనంగా సీత్లా పండుగ వేడుకలు…

ఆకుతోటబావితండాలో ఘనంగా సీత్లా పండుగ వేడుకలు…

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  
ప్రతీ ఏడాది గిరిజన ప్రజల ఆనవాయితీగా, సాంప్రదాయ బద్దంగా చిన్న పుష్యమి కార్తెలో జరుపుకునే సీతాలా పండుగను  మంగళవారం ఆకుతోట బావితండ ను దేవతలు కరుణించాలని, విరివిగా వర్షాలు కురవాలని, పాడి పంటలతో గ్రామాలు చల్లగా ఉండాలని కుల దేవతలను వేడుకుంటూ గిరిజనులు సీత్ల పండుగను ఘనంగా జరుపుకున్నారు. భువనగిరి మండల పరిధిలోని ఆకుతోటబావితండ గిరిజన మహిళలు ప్రత్యేక పూజలు, వంటకాలు తయారు చేసి డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా గ్రామ పొలిమేరలో ఉన్న దేవతలకు నైవేద్యం సమర్పించారు. ఏడుగురు సీత్లా భవాణి వద్ద మేకలు, కోళ్లను బలి ఇచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. వంటకాలను పశువులపై చల్లి ఎటువంటి సమస్యలు రాకుండా చూడాలని, స్థానికులు అనారోగ్య బారిన పడకుండా కాపాడమని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -