Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సరైన ప‌త్రాలు లేని న‌గ‌దు ప‌ట్టివేత

సరైన ప‌త్రాలు లేని న‌గ‌దు ప‌ట్టివేత

- Advertisement -

నవతెలంగాణ – మునిప‌ల్లి
స్థానిక స‌ర్పంచ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మండ‌ల ప‌రిధిలోని బుదేరా చౌర‌స్తాలో మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయ‌క్, ఎఫ్ఎస్‌టి (ఫ్లైయింగ్ స్క్వాడ్‌) అధికారి ప్ర‌దీప్ లు మంగ‌ళ‌వారం వాహ‌నాల త‌నిఖీ చేపట్టారు. ఈ క్రమంలో మండంలోని పెద్ద‌లోడి గ్రామానికి చెందిన పెద్ద‌గొల్ల ద‌స్స‌య్య రూ.ల‌క్ష న‌గ‌దును కారులో తీసుకెళ్తుండ‌గా త‌నిఖీ చేశారు. ఆ న‌గ‌దుకు సంబంధించి ఎలాంటి ప‌త్రాలు లేక‌పోవ‌డంతో వాటిని అధికారులు సీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నిక‌ల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల వేళ యాబై వేలకు మించి ప‌త్రాలు లేకుండా న‌గ‌దు తీసుక‌ళ్తే చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామని తెలిపారు. అంతేకాదు ఆ నగదును జప్తు చేస్తామని హెచ్చ‌రించారు. ఈ విష‌యాన్ని ప్ర‌తి ఒక్కరూ గ‌మ‌నించాల‌ని సూచించారు. ఈ త‌నిఖీలో అధికారులు, పోలీసు సిబ్బంది త‌దిత‌రులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -