– ఆంధ్రా నుంచి తరలిస్తున్న దళారులు, మధ్యవర్తులు
– చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో పట్టుకున్న పోలీసులు : వివరాలు వెల్లడించిన డీఎస్పీ
– అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలని హెచ్చరిక
నవతెలంగాణ- మిర్యాలగూడ
ఆంధ్రా నుంచి అనధికారికంగా వచ్చిన ధాన్యం లారీలను పట్టుకున్నట్టు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ శనివారం వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నందున దళారులు మధ్యవర్తుల ద్వారా ఏపీ నుంచి ధాన్యం లారీలను తీసుకొస్తున్నారని తెలిపారు. మిర్యాలగూడ డివిజన్‌లోని వాడపల్లి నాగార్జునసాగర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటికీ ఆంధ్రా నుంచి వచ్చిన వంద నుంచి 150 లారీల వరకు ధాన్యాన్ని వెనక్కి పంపించామని, అయినప్పటికీ అక్రమ మార్గాన ధాన్యాన్ని తరలిస్తున్నారని చెప్పారు. శనివారం చెక్‌పోస్ట్‌లో వద్ద ఆరు లారీలు, డీసీఎంలో సుమారు 2,200 బస్తాల ధాన్యాన్ని పట్టుకున్నట్టు తెలిపారు. ఈ ధాన్యాన్ని తరలించే దళారులు, మధ్యవర్తులపై కేసులు నమోదు చేశామన్నారు. అక్రమంగా ఎవరైనా ధాన్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ పీఎన్‌డీ.ప్రసాద్, ఎస్‌ఐలు లక్ష్మయ్య, భిక్షం, సంజీవరెడ్డి, ఏఎస్‌ఐ రాములునాయక్ తదితరులు ఉన్నారు.
ధాన్యం లారీల పట్టివేత
- Advertisement -
- Advertisement -