నవతెలంగాణ – మునిపల్లి
గుట్టుచప్పుడు కాకుండా బీదర్ నుంచి హైదరాబాద్ వైపు తరలిస్తున్న ఎండు గంజాయిని సోమవారం మునిపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బీదర్ వైపు నుంచి హైదరాబాద్ వైపు తరలిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద మునిపల్లి పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో ఓ స్కూటిపై అనుమానం రాగా ఆపితనిఖీ చేయగా అందులో 115 గ్రాముల ఎండు గంజాయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఎండు గంజాయిని సరఫరా చేస్తున్న హైదరాబాద్ లోని చింతల్ కు చెందిన దేవరకొండ నాని, పల్లి సాయి పవన్ లను విచారించగా బీదర్ లోని ఇరానీ గల్లీలో తక్కువ ధర కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు వారు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ మేరకు పట్టుబడిన ఎండు గంజాయితోపాటు ఒక స్కూటి, రెండు సెల్ ఫోన్ లనుస్వాధీనం చేసుకోవడంతో నిందితులు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయి పట్టివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



