నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థి కార్తికేయ భౌతిక రసాయన శాస్త్రం ప్రతిభ పరీక్షలో రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన భౌతిక రసాయన శాస్త్రం ప్రతిభా పరీక్షలో ఉత్తమ ప్రతిభను కనబర్చిన కార్తికేయ రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు ఆయన వివరించారు.
ఈ మేరకు మంగళవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో భౌతిక రసాయన శాస్త్రం ప్రతిభ పరీక్షలో రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థి కార్తికేయను ప్రధానోపాధ్యాయులు సాయన్న అభినందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు.గైడ్ టీచర్ గా వ్యవహరించిన భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయురాలు సరోజన లక్ష్మిని ప్రశంసించారు. ఈ నెల 26 వ తేదీన హైదరాబాద్ లోని ఎస్సీఈఆర్టీలో జరిగే రాష్ట్ర స్థాయి ప్రతిభ పరీక్షలో విద్యార్థి కార్తికేయ పాల్గొంటాడని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.



