Monday, June 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్రీడా పాఠశాలలకు ఈనెల 18న ఎంపిక పోటీలు.

క్రీడా పాఠశాలలకు ఈనెల 18న ఎంపిక పోటీలు.

- Advertisement -

ఎంఈఓ లక్ష్మన్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
: తెలంగాణ రాష్ట్రంలోని హహీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతిలో ప్రవేశం కోసం మండల విద్యార్థిని, విద్యార్థులకు మండల స్థాయి ఎంపిక పోటీలు ఈనెల 18న బుధవారం ఉదయం 9 గంటలకు మండలం ఎడ్లపల్లి గ్రామపరిదిలోగల జంగిడిపల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్ క్రీడా మైదానంలో క్రీడా పోటీలు నిర్వహించుతున్నట్లుగా మండల విద్యాధికారి లక్ష్మణ్ బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గుర్తింపు పొందిన పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్న 31 ఆగస్టు 2016 నుంచి 1 సెప్టెంబర్ 2017 సంవత్సరం లోపు జన్మించిన వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. ఇందులోని అంశాలు ఎత్తు.బరువు. 30 మీటర్ల ప్లేయింగ్ స్టార్ట్ పరుగు, షటిల్ పరుగు, స్టాండింగ్ బ్రాడ్ జంపు 800 మీటర్ల పరుగు పందెం, మెడిసిన్ బాల్ త్రో, వర్టికల్ జంప్, ఫ్లెక్స్ బిలిటి, టెస్టులను నిర్వహిస్తున్నట్టుగ వివరించారు. ఈ తొమ్మిది పరీక్షల్లో మూడు మార్కుల చొప్పున మొత్తం 27 సాధించిన విద్యార్థులకు ఈనెల 23న జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించే జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే విద్యార్థులు తమ వెంట ఆధార కార్డు.నాలుగవ తరగతి బోనాఫైడ్ సర్టిఫికెట్ ,డేట్ అఫ్ బర్త్, కుల ధ్రువీకరణ పత్రం మూడవ తరగతి ప్రోగ్రెస్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరు కావాలన్నారు. ఎంఈఓ వెంటా మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పూర్ణచంద్రరావు, మండలంలోని వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం 9000948940,8639346695 ఫోన్ నెంబర్లను సంప్రదించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -