Saturday, February 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం కప్ పోటీలకు ఆదర్శ విద్యార్థుల ఎంపిక

సీఎం కప్ పోటీలకు ఆదర్శ విద్యార్థుల ఎంపిక

- Advertisement -

జిల్లా స్థాయిలో సత్తా చాటి బంగారు పతకాలు సాధించిన ఆదర్శ విద్యార్థులు
నవతెలంగాణ – కాటారం

జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీల్లో కాటారం మండల కేంద్రంలోని ఆదర్శ హైస్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శనతో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు అర్హత సాధించడం గర్వకారణంగా మారింది.

భూపాలపల్లి జిల్లా చెల్పూర్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-18 ఖోఖో పోటీల్లో జె. అభికుమార్, జె. శ్రీనందన్ విద్యార్థులు అద్భుత ఆటతీరు ప్రదర్శించి బంగారు పతకాలు సాధించారు. అలాగే కబడ్డీ విభాగంలో పీ. అభినవ్, హ్యాండ్‌బాల్ విభాగంలో జె. క్రిష్ణతేజ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, కరస్పాండెంట్ జనగామ కార్తీక్ రావు, ప్రిన్సిపాల్ కృషితలు, పీఈటీ కార్తీక్ తదితరులు అభినందించారు. రాష్ట్ర స్థాయిలోనూ సత్తా చాటి పాఠశాలకు, కాటారం మండలానికి మంచి గుర్తింపు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -