నవతెలంగాణ- దుబ్బాక 
దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రయాస్-2025 కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక మోడల్ స్కూల్ గా లచ్చపేట ఎంపికవడం రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచిందని మండల విద్యాధికారి (ఎంఈఓ) జోగు ప్రభుదాస్ కితాబిచ్చారు. భవిష్యత్తులో మరిన్ని కీర్తి పురస్కారాలను అందుకునేలా మోడల్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు కృషి చేయాలన్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్. బుచ్చిబాబు, గైడ్ టీచర్ కే.జ్యోతి, విద్యార్థులు మహమ్మద్ అజీజ్, శివకుమార్ లను మండల మాజీ కోఆప్షన్ నెంబర్ మహమ్మద్ రఫీ తో కలిసి ఆయన శాలువా కప్పి మెమెంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మదన్మోహన్ ఎం.నరేష్, పల్లె శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయ బృందం, సీఆర్పీ టీ. నవీన్, మహమ్మద్ వసీం, వహీద్ పలువురున్నారు.

 
                                    