నవతెలంగాణ-కాటారం : కాటారం మండల కేంద్రంలో బుధవారం నేతకాని సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. గౌరవ అధ్యక్షులు కొండగొర్ల బాణయ్య నాయకత్వంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఫౌండేషన్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించి, కొత్త నిర్వహణ కమిటీని ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడిగా కుమ్మరి అశోక్, ప్రధాన కార్యదర్శిగా గంట దేవదాస్ , కోశాధికారిగా దుర్గం సాగర్ బాబు నియమితులయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా గాలి సడువలి, గోగుల రాజేష్, కార్యదర్శిగా బీరెల్లి రాజయ్య ఎంపికయ్యారు. సలహాదారులుగా గంట సమ్మయ్య, కొండగొర్ల రమ్ నారాయణ , డోంగిరి రవి, పాగే రంజిత్ లను ఎన్నుకున్నారు.
సమావేశంలో పాల్గొన్న సభ్యులు మాట్లాడుతూ, నేతకాని కులబంధువుల సంక్షేమం, సామాజిక అభివృద్ధి లక్ష్యంగా ఫౌండేషన్ పనిచేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. కొత్త కమిటీ సమిష్టిగా పనిచేసి సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి మండలంలోని నేతకాని కులబంధువులు, యువత పెద్ద ఎత్తున హాజరై కొత్త కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.



