శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసుధనాచారి
నవతెలంగాణ – మల్హర్ రావు
జీవితాన్ని తీర్చిదిద్దే ప్రధాన అంశాల్లో స్వయంకృషి..స్వీయ ప్రతిభ ముఖ్యమని, జీవితాన్ని అర్థం చేసుకుంటేనే అర్థం అవుతుందని తెలంగాణ తొలి శాసనసభాపతి, శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనాచారి అన్నారు.మండలం కొయ్యూరులో స్వర్గీయ పుట్ట లింగమ్మ స్మారకార్థం పుట్ట మధన్న ఫ్రెండ్లీ యూత్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంథని నియోజకవర్గ స్థాయి పుట్ట మధన్న ప్రీమియర్ లీగ్ సీజన్ -1 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్,భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి రాకేష్‌లతో కలిసి ఆయన విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈసందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు పుట్ట మధూకర్‌తో 12ఏండ్ల నుంచే పరిచయం ఉందని,కానీ అంతముందు పదేండ్ల క్రితమే ఆయన పేరుతో పరిచయం ఉందన్నారు.పుట్ట మధూకర్ అనే వ్యక్తి నిర్విరామమైన ప్లేయర్ అని అభివర్ణించారు.పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు తరపున అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఒక పరమపవిత్రమైన కార్యక్రమాలన్నారు.రాజకీయ నాయకుల వ్యక్తిగతమైన జీవితఅనుభవాలు పరిశీలిస్తే రకరకాల మనస్థత్వం కలవారు ఉంటారని,కానీ రాజకీయాన్ని సేవగా గెలుపు ఓటమిలకు అతీతంగా ప్రజల మధ్య ఉంటూ ప్రజలు అన్ని రంగాల్లో ముందుండాలని తపించే వాడే నిజమైన నాయకుడని,ఆ కోవకు చెందిన నాయకుడే పుట్ట మధూకర్ అన్నారు.క్రీడా రాజకీయ రంగాల్లో ఒకస్థాయికి ఎదిగిన వారు ఎవరి దయాదాక్షన్యాల మీద వచ్చిన వారు కాదని,స్వయంకృషి స్వీయ ప్రతిభతోనే ఎదిగిరాన్నది పుట్ట మధూ ఒక నిదర్శనమన్నారు.
తల్లిలేని బిడ్డగా పుట్టుకతోనే ఆ బందం తెగిపోయిన వాళ్లు ఎన్ని రకాల క్షోభలను అనుభవించి తనను తాను చెక్కిన శిల్పంలా తయారు అవుతారని, అలాంటి శిల్పమే పుట్ట మధూకర్ అన్నారు.ప్రతి క్రీడాకారులు పుట్ట మధూకర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.ప్రతి క్రీడాకారులు తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలని, నీతి స్పూర్తి జీవితం అంటే ఏమిటనేది కొన్ని సందర్బాల్లో మాత్రమే నేర్చుకునే అవకాశం వస్తుందని, ఆ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవారే నిజమైన వ్యక్తులుగా నిలుస్తారన్నారు. 20ఏండ్లుగా ఈ ప్రాంతంలో పుట్ట మధు పాత్రలేని రాజకీయం ఉందా అని ప్రశ్నించారు.ఒక్క వ్యక్తి సమాజాన్ని ఎంత గొప్పగా ప్రబావితం చేయవచ్చు అనేదానికి పుట్ట మధు నిదర్శనమన్నారు.అనేక ఏండ్ల క్రితం మనిషికి ఎంత టాలెంట్ ఉన్నా అద్బుతంగా ఎదగడానికి అనుకూలమైన వాతావరణం లేకుండెనని, కానీ ఈనాడు టాలెంట్ ఉంటే ప్రపంచ స్థాయిని శాసించే అవకాశాలు ఉన్నాయని,క్రీడాకారులు ఆ దిశగా ఎదుగాలని ఆయన ఆకాంక్షించారు.
పదిహేడు రోజుల పాటు 12 టీంలతో పుట్ట లింగమ్మ స్మారకంగా అందరి సహాకారంతో ఐపీఎల్‌కు ధీటుగా ఇక్కడ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు.మండలం కొయ్యూరులో స్వర్గీయ పుట్ట లింగమ్మ స్మారకార్థం పుట్ట మధన్న ఫ్రెండ్లీ యూత్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంథని నియోజకవర్గ స్థాయి పుట్ట మధన్న ప్రీమియర్ లీగ్ సీజన్ -1 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తన తల్లి పేరున ఇంత గొప్పగా టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని, ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. క్రీడల్లో గెలిచిన వారు ప్రైజ్‌లు తీసుకువెళ్తే ఓడిన వారు మాత్రం మనసులు గెలుచుకుంటారని, వారి ఓటమి రేపటి గెలుపుకు నాంది అనేది గమనించాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.ఎక్కడైనా టీం వర్క్ ఉంటేనే గెలుపు సాధ్యమవుతుందని క్రికెట్ నేర్పిస్తుందని భూపాలపల్లి మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షినీ రాకేష్ అన్నారు.
ప్రీమియర్ లీగ్ సీజన్ -1 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆమె సభాధ్యక్షత వహించి మాట్లాడుతూ ప్రీమియర్ లీగ్ అనేక కుట్రలను ఎదురించి పోరాడి ఫైనల్ మ్యాచ్‌ను పూర్తి చేసుకున్నామన్నారు. ఈ పోరాటం అందరూ స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన పుట్ట మధన్న వారియర్స్ ప్రథమ, ఎంఎస్సార్ లియోస్ ద్వితీయ, రెబల్స్ టీం తృతీయ స్థానాల్లో నిలువగా వారికి బహుమతులను ముఖ్య అథితుల చేతులమీదుగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో టోర్నీ నిర్వహకులు,బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



