– కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి తక్కూరి దేవేందర్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
పదేండ్ల చీకట్లను, ఇక్కట్లను చీల్చి… కొత్త ఇంటి, కొత్త రేషన్ కార్డుల కల నిజం చేసి, సన్న బియ్యంతో నిరుపేదల కుటుంబంలో ఆనందం నింపిన వేళ వారిలో ఆత్మగౌరవం మురిసిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి తక్కురి దేవేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. గురువారం మండలంలోని ఉప్లూర్ లో నూతనంగా కొత్త రేషన్ కార్డులు మంజూరైన లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తున్న ప్రజా పాలనలో పేదలు ఆత్మగౌరవంతో మురిసిపోతున్నారని తెలిపారు. వారి ఆనందంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్ముల రవీందర్, నాయకులు అవారి సత్యం, మారుపాక నరేష్, సుంకరి విజయ్ కుమార్, కొమ్ముల రాజారెడ్డి, తక్కురి శేఖర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదల కుటుంబంలో ఆత్మగౌరవం మురిసింది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES