Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బషీరాబాద్ పాఠశాలలో స్వయం పరిపాలన

బషీరాబాద్ పాఠశాలలో స్వయం పరిపాలన

- Advertisement -

– ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రధానోపాధ్యాయులుగా లక్మ శ్రీ వర్షిత్, ఆఫీస్ సబార్డినేట్ గా కే.గోపాల్ బాధ్యతలు నిర్వర్తించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తూ తోటి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు.

అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో స్వయం పరిపాలన సందర్భంగా తోటి విద్యార్థులకు ఉత్తమ బోధన చేసిన తోపారం వందన కు మొదటి బహుమతి, టి.శివ ప్రియకు ద్వితీయ బహుమతి, బి.హర్షవర్ధనికి తృతీయ బహుమతు లను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని అన్ని వృత్తులకెల్లా అతి ముఖ్యమైన వృత్తి ఉపాద్యాయ వృత్తి అని పేర్కొంటూ విద్యార్థులు వారి యొక్క అనుభవాలను పంచుకున్నారు. భవిష్యత్తులో ఉపాధ్యాయ వృత్తిని ఇష్టంగా స్వీకరిస్తామని పిల్లలు పేర్కొనడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కనుక గంగాధర్, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -