Thursday, February 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెరికిట్ ఉన్నత పాఠశాలలో స్వయంపాలన దినోత్సవం 

పెరికిట్ ఉన్నత పాఠశాలలో స్వయంపాలన దినోత్సవం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని పెరికిట్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ స్వయం పాలన దినోత్సవం  గురువారం నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు  శ్రీనివాస్  సభ అధ్యక్షత వహించగా ఒకరోజు ఉపాధ్యాయులుగా పనిచేసిన విద్యార్థులు వారి అనుభవాలను చెప్పడం జరిగింది. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని పాఠాలు బోధించడం అంటే ఒక కళ అని అందరి విద్యార్థులకు అర్థమయ్యే పద్ధతిలో బోధించడం చాలా కష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -