నవతెలంగాణ – మిడ్జిల్
మండలంలోని కంచనపల్లి గ్రామంలో శుక్రవారం ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ క్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులే తోటి విద్యార్థులకు విద్యను బోధించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మహేశ్వరి మల్లేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని అన్నారు. ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చినది ఉపాధ్యాయులేనని తెలిపారు. ఒక్కరోజు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించిన విద్యార్థులు భవిష్యత్తులో కూడా ఉపాధ్యాయులు అయ్యేవిధంగా కష్టపడి చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు.
చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, పేదరికం తొలగిపోవాలంటే చదువు ఒకటే మార్గంమని ఉద్భోదించారు. అనంతరం ఒక్కరోజు ఉపాధ్యాయ విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎం వెంకటయ్య, ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీ రాణి ,ఉపాధ్యాయులు విజయ్ భాస్కర్,జిల్లా విద్యాధికారిగా, విశ్వంత్, మండల విద్యాధికారిగా దీపిక జిహెచ్ఎం గా రుత్విక్, ప్రధానోపాధ్యాయులుగా సందీప్, 12 మంది విద్యార్థులు ఉపాధ్యాయులు అయినారు.




