నవతెలంగాణ-చిన్నకోడూరు
రామంచ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తమ తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి శనివారం స్పపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గా తనుశ్రీ, డీఈవోగా హారిక, ఎంఈఓ గా యువరాజ్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులుగా సహస్ర, ప్రధానోపాధ్యాయులుగా మనుశ్రీ, ఉపాధ్యాయులుగా కీర్తన, అంబిక, అనుశ్రీ, ప్రహర్షిణి, రేవతి, శాన్వి, సమీక్ష, విజ్ఞానేశ్వరి, మోక్షిత, ఆరాధ్య, భాను శ్రీ, నందన, ఇశిక, నందకిషోర్, దీపక్, శ్రీమాన్, సాత్విక్, రిషికేష్, శివకుమార్, యతీష్, జస్వంత్, శశివర్ధన్, శివతేజ, శివకుమార్, శివప్రసాద్ లు వ్యవహరించి పాఠశాల విధులను సక్రమంగా నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి తిరుపతి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్యలు కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై.వి.సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సునీత, ఆబెద బేగం, నాగమణి, వరప్రసాద్ యాదయ్య, స్వరూపలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.



