Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాజ్ పూర్ లో స్వపరిపాలన దినోత్సవ వేడుకలు

తాజ్ పూర్ లో స్వపరిపాలన దినోత్సవ వేడుకలు

- Advertisement -

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేల..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

భువనగిరి మండలంలోని తాజ్పూర్ గ్రామంలో  మండల పరిషత్ ప్రాథమిక కొన్నత పాఠశాలలో బుధవారం సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి   ముఖ్యఅతిథిగా గ్రామ ‘సర్పంచ్ ‘ర్యాకల సంతోష శ్రీనివాస్ హాజరై, మాట్లాడారు. విద్యార్థులు ప్రజాప్రతినిధులు గా, అధికారులుగా, ఉపాధ్యాయులుగా(కలెక్టర్, గ్రామ సర్పంచ్, ఎం ఈ ఓ గా , ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వివిధ పాత్రలు పోషించి ఎంతో చక్కని ప్రతిభ ను కనబరిచారని అన్నారు. 

విద్యార్థులు ఎంతో ప్రతిభ కనపరిచారని మీరు పోషించిన ఈ పాత్రలు భవిష్యత్తులో నిజం చేసుకునే విదంగా కష్ట పడి చదవాలని,మీ మీ జీవితాల్లో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. స్వపరిపాలన దినోత్సవ పాత్రదారులకు జ్ఞాపికాలను అందించి పాఠశాలకు ఎల్లవేళలా తన వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాని అన్నారు. 

ఈ కార్యక్రమం లో సామజిక వేత్త డా,ర్యాకల శ్రీనివాస్,పంచాయతీ కార్యదర్శి బి నరేందర్ ,ఉప సర్పంచ్ వరిగంటి కృష్ణ, ఏ ఏఎంసి  చైర్మన్ వరిగంటి రమ్య,వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, మహ్మద్ గాలిబీ, బొమ్మారపు రామక్రిష్ణ, బొమ్మారపు లక్ష్మి, బీట్కూరి మహేష్, వరిగంటి మానస, షేక్ అహ్మద్, ఉపాధ్యాయ బృందం,విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -