Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సన్ షైన్ స్కూల్లో స్వపరిపాలన దినోత్సవం, సైన్స్ డే

సన్ షైన్ స్కూల్లో స్వపరిపాలన దినోత్సవం, సైన్స్ డే

- Advertisement -

నవతెలంగాణ – చండూరు 
స్థానిక సన్ షైన్ పాఠశాలలో శనివారం  స్వపరిపాలన దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. స్వపరిపాలన దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులుగా ఒక్కరోజు బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రతిరోజు పాఠశాల నిర్వహణలో ఉపాధ్యాయుల బాధ్యత ఏ విధంగా ఉంటుందని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒక్కరోజు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మాట్లాడుతూ గురువు యొక్క కష్టం అనేది తెలుసుకోవడం జరిగింది అని గురువులను మరొకసారి మనస్ఫూర్తిగా అభినందించారు. 

మాక్ అసెంబ్లీలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ల  మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ల ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి నాయకుల వేషధారణలో వేడుకను రక్తి కట్టించారు.  పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని సర్ సివి రామన్  చిత్రపటానికి పూలమాలతో అలంకరించి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ కోడి వెంకన్న  మాట్లాడుతూ స్వపరిపాలన దినోత్సవం సందర్భంగా పాఠశాల నిర్వహణలో ఉన్నటువంటి బరువు బాధ్యతలను విద్యార్థినీ విద్యార్థులు తెలుసుకోవడం ద్వారా పాఠశాలలో ప్రవర్తించే తీరులో మార్పు రావాలని కోరుకున్నారు.

సమాజంలో జరుగుతున్న రాజకీయ అవగాహనను కలిగి ఉండడం ద్వారా విద్యార్థులు సర్వతో ముఖాభివృద్ధులు కాగలరని అభిలషించారు.  జాతీయ సైన్స్ దినోత్సవాన్ని యొక్క ప్రాముఖ్యతను సర్ సివి రామన్  రామన్ ఎఫెక్ట్ ను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోడి సుష్మా, ప్రిన్సిపాల్ రవికాంత్, వినయ్, లతీఫ్ పాషా, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, ఒక్కరోజు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -