Thursday, May 29, 2025
Homeక్రైమ్డ్రగ్‌ లైసెన్స్‌ లేకుండా వెటర్నరీ మందుల అమ్మకం

డ్రగ్‌ లైసెన్స్‌ లేకుండా వెటర్నరీ మందుల అమ్మకం

- Advertisement -

– డీసీఏ దాడుల్లో పట్టివేత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

డ్రగ్‌ లైసెన్స్‌ లేకుండా అమ్ముతున్న వెటర్నరీ మందులను డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వరంగల్‌ జిల్లా గిర్మాజిపేట్‌లోని ఓల్డ్‌ గ్రెయిన్‌ మార్కెట్‌ ఏరియాలో సాయికిరణ్‌ పౌల్ట్రీ అండ్‌ వెట్‌ మెడికల్స్‌పై దాడి చేసి రూ.2.5 లక్షల విలువైన మందులను నిల్వ ఉంచినట్టు గుర్తించారు. వాటిని సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు. అన్ని రకాల ఫ్లూ, జ్వరాలకు సహాయపడుతుందంటూ తప్పుదోవ పట్టించే ప్రకటనలతో అమ్ముతున్న ప్లాటొకొర్‌-టోటల్‌ సిరప్‌ కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌ నగర్‌ లోని ఒక మెడికల్‌ స్టోర్‌లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

దీనిని హర్యానాలోని ఆల్ట్రా గ్రీన్‌ యూనిట్‌ -1 తయారు చేస్తుండగా, హిమాచల్‌ ప్రదేశ్‌లోని బయోకోర్‌ ఫార్మాస్యూటికల్స్‌ మార్కెటింగ్‌ చేస్తున్నది. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -