Tuesday, January 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం20న ఖమ్మంలో సెమినార్‌

20న ఖమ్మంలో సెమినార్‌

- Advertisement -

‘వర్తమాన భారతదేశం-వామపక్షం
ముందున్న సవాళ్లు’ అంశంపై చర్చ
హాజరుకానున్న వామపక్ష పార్టీల
జాతీయ ప్రధాన కార్యదర్శులు : కూనంనేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

భారత కమ్యూనిస్టు పార్టీ శతవసంతాలను పురస్కరించుకొని ఖమ్మంలో ఈ నెల 20న ‘వర్తమాన భారత దేశం- వామపక్షం ముందున్న సవాళ్లు’ అనే అంశంపైన సెమినార్‌ నిర్వహిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. 18న ఖమ్మంలో లక్షలాది మందితో సీపీఐ బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు. 20న ఉదయం 10 గంటలకు ఖమ్మంలో ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో జరిగే సెమినార్‌కు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ. బేబీ, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య, ఆర్‌ఎస్పీ జాతీయ కార్యదర్శి మనోజ్‌ భట్టాచార్య, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి జి.దేవరాజన్‌ పాల్గొంటారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -