Sunday, November 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవరద నష్టం వివరాలు పంపండి

వరద నష్టం వివరాలు పంపండి

- Advertisement -

– కలెక్టర్లకు సీఎస్‌ రామకృష్ణారావు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మొంథా తుపాన్‌ ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి వెంటనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మొంథా తుపాన్‌ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో శనివారం హైదరాబాద్‌లోని బీఆర్‌.అంబేద్కర్‌ సచివాలయం నుంచి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 24 జిల్లాలు తుపాన్‌కు ప్రభావితమయ్యాయని తెలిపారు. జిల్లాల్లో జరిగిన పంటలు, రహదారులు, నీటి వనరులు, పశువులు, ప్రాణ నష్టంతో పాటు ఇతర ప్రాథమిక వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో 25 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం ఆకస్మికంగా కురుస్తోందనీ, ఈ నేపథ్యంలో అత్యవసర సమయంలో చేపట్టాల్సిన చర్యలపై జిల్లాల వారీగా ముందస్తు ప్రణాళికలను రూపొందించుకోవాలని సీఎస్‌ సూచించారు. తుఫాన్‌ ప్రభావంతో ఆయా జిల్లాల్లో దెబ్బతిన్న రహదారులు, విద్యుత్‌ లైన్లు, నీటి వనరులకు తాత్కాలిక పునరుద్ధరణ పనులు ముమ్మరంగా చేపట్టినట్టు అధికారులు సీఎస్‌కు తెలిపారు. ఎక్కడైనా అంగన్వాడీ భవనాలు, పాఠశాల భవనాలు ధ్వంసం అయితే వాటి పునరుద్ధరణకు వెంటనే నిధులు మంజూ రు చేస్తున్నట్టు వారికి సీఎస్‌ వివరించారు. తరచుగా ముంపుకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి, శాశ్వత చర్యలు చేపట్టాలనీ, అవసరమైన ప్రతిపా దనలు ప్రభుత్వానికి పంపాలని సూచించారు. పరిహారం అందిం చేందుకు వీలుగా నష్టం వివరాలను సోమవారం వరకు పంపించాల్సిందిగా కోరారు. ఎలాంటి అలసత్యం లేకుండా పునరావాస చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. టెలికాన్ఫరెన్స్‌లో విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -