పోలీస్ కమిషనర్ కు అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేల వినతి
నవతెలంగాణ – కంఠేశ్వర్ : పహల్గాంలో హిందువులపైన జరిగిన ఉగ్రవాద దాడి తరువాత దేశంలో శాంతి భద్రతల దృష్ట్యా పాకిస్థాన్ పౌరులు తమ దేశానికి వెళ్లిపోవాలని అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ, అర్ముర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జిల్లా పోలీస్ కమీషనర్ సాయి చైతన్యకి వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేసి, నిజామాబాదు జిల్లాలో పాకిస్థాన్ పౌరసత్వం ఉన్న వ్యక్తులను వెళ్లగొట్టాలని అన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. నిజామాబాదు జిల్లాలో పాకిస్తాన్ పౌరసత్వం, చెల్లుబాటు కానీ వీసాలతో నివసించే వారిని గుర్తించి వారిని బహిష్కరించాలని సీపీకి సూచించారు. గతంలో జిల్లాలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు పట్టుపడ్డ సందర్భాన్ని గుర్తు చేస్తూ.. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేసి వారిని గుర్తించాలని తెలిపారు. నగర అంతర్గత శాంతి భద్రతలకు విఘతాం కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కఠినంగా అమలు చేసి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘతాం కలుగకుండా.. ఈ దేశ పౌరులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్పొరేట్లర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పాక్ పౌరులను తమ దేశానికి పంపండి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES