Thursday, December 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంయూపీఎస్సీకి డీజీపీ అర్హుల లిస్ట్‌ పంపండి

యూపీఎస్సీకి డీజీపీ అర్హుల లిస్ట్‌ పంపండి

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
డీజీపీగా శివధర్‌రెడ్డి నియామకం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా జరిగిందంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు డీజీపీ పోస్టుకు అర్హులైన వారి లిస్ట్‌ను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)కి పంపాలంది. ఆ లిస్ట్‌లోని పేర్లను యూపీఎస్సీ ఆమోదించాక రిపోర్టుతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. విచారణను వచ్చే నెలాఖారుకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ బుధవారం ఆదేశించారు.

సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ అమలు చేయకుండా డీజీపీగా శివధర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించిందంటూ హైదరాబాద్‌కు చెందిన ధన్‌గోపాల్‌రావు వేసిన రిట్‌ను కొట్టేయాలనీ ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదించారు. యూపీఎస్సీకి లిస్ట్‌ పంపామనీ, అయితే, అందులో ఏపీకి కేటాయింపు జరిగిన మహిళా ఐపీఎస్‌ అధికారిణి ఉండటంపై అభ్యంతరం వచ్చిందని చెప్పారు. అభిలాష బిస్త్‌ను ప్యానెల్‌లో చేర్చడంపై సందేహాన్ని వ్యక్తం చేయడంలో ఆలస్యం అయ్యిందన్నారు. ప్రభుత్వం సహకరించడం లేదనీ, తగిన సమాచారం ఇవ్వడం లేదని యూపీఎస్సీ తరఫు న్యాయవాది చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -