Tuesday, January 20, 2026
E-PAPER
Homeజాతీయంఉన్నావో లైంగికదాడి ఘటనలో సెంగర్‌కు చుక్కెదురు

ఉన్నావో లైంగికదాడి ఘటనలో సెంగర్‌కు చుక్కెదురు

- Advertisement -

బాధితురాలి తండ్రి మృతి కేసులో బీజేపీ బహిష్కృత నేత పిటిషన్‌ తిరస్కరణ
న్యూఢిల్లీ:
ఉన్నావో లైంగికదాడి ఘటనలో బాధితురాలి తండ్రి మృతి కేసులో బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్‌ సింగ్‌ సెంగర్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో పదేండ్ల శిక్షను నిలిపివేయాలంటూ దాఖలు చేసిన ఆయన పిటిషన్‌ను న్యాయ స్థానం తోసిపుచ్చింది. శిక్ష విషయంలో ఉపశమనం కల్పించేందుకు సరైన కారణాలు లేవని జస్టిస్‌ రవీందర్‌ పేర్కొన్నారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేశారు. ఉన్నావో లైంగికదాడి కేసులో కుల్దీప్‌సింగ్‌ సెంగర్‌ దోషిగా తేలి, జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ఇటీవల ఈ శిక్షను నిలిపివేస్తూ.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక షరతులతో కూడిన బెయిల్‌ను సైతం మంజూరు చేసింది. అయితే.. ఈ తీర్పుపై సీబీఐ అధికారులు, బాధితురాలి తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో శిక్ష నిలిపివేతపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. కస్టడీ నుంచి విడుదల చేయొద్దని పోలీసుశాఖను ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -