Thursday, October 9, 2025
E-PAPER
Homeఆదిలాబాద్Congress Party: ఆరేండ్ల పాటు కాంగ్రెస్‌ సీనియర్ నేత సస్పెండ్‌

Congress Party: ఆరేండ్ల పాటు కాంగ్రెస్‌ సీనియర్ నేత సస్పెండ్‌

- Advertisement -

నవతెలంగాణ ఆసిఫాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ సిర్పూర్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రావి శ్రీనివాస్‌పై ఆ పార్టీ సస్పెన్షన్‌ వేటు వేసింది. శ్రీనివాస్‌ను ఆరేండ్లపాటు సస్పెండ్‌ చేస్తున్నట్టు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదివారం ప్రకటించింది. రావి శ్రీనివాస్‌ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్కపై విమర్శలు చేయడం తోపాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారని ఆసిఫాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంపై స్పందించిన టీపీసీసీ క్రమశిక్షణ చర్య కమిటీ(డీఏసీ) ఛైర్మన్‌ చిన్నారెడ్డి షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీలోపు వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో పార్టీ నియమావళిని అనుసరించి చర్యలుంటాయని షోకాజ్‌ నోటీసులో పేర్కొన్నారు. అయినను రావి శ్రీనివాస్‌ నుంచి సరైన వివరణ రాకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -