– నివాళులర్పించిన సీపీఐ, సీపీఐ(ఎం) నేతలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
– జీవితాన్ని పేదలకు అంకితం చేశారు : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
నవతెలంగాణ-చిలుకూరు : సీపీఐ సీనియర్ నాయకులు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు దొడ్డ నారాయణరావు(96) శనివారం మరణించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో దొడ్డ నారాయణరావు మృతదేహానికి సీపీఐ, సీపీఐ(ఎం) నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పూలమాలలేసి నివాళులర్పించారు. పేద బడుగు, బలహీన వర్గాల కోసం నారాయణరావు జీవితాంతం పోరాడారని, ఆయన జీవితాన్ని కమ్యూనిస్టు పార్టీకి అంకితం చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జులకంటి రంగారెడ్డి అన్నారు. నారాయణరావు చిన్నతనం నుంచి కమ్యూనిస్టు పార్టీవైపు ఆకర్షితులై తన అన్న దొడ్డ నర్సయ్య అడుగుజాడల్లో నడిచారని చెప్పారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా, తెలంగాణ సాయుధ రైతాంగం పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. సుదీర్ఘకాలం సర్పంచ్‌గా, సహకార సంఘం చైర్మెన్‌గా, ఎంపీపీగా, సీపీఐ ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్యదర్శిగా ప్రజల కోసం విశేష సేవలందించారని వివరించారు. అలాంటి గొప్ప వ్యక్తి మృతి సీపీఐకి, గ్రామానికి తీరని లోటని అన్నారు.
పలువురి నివాళులు
కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డి, బీఆర్‌ఎస్, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, వేనేపల్లి చందర్‌రావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ అందే సత్యం, ముత్తవరపు పాండు రంగారావు, లక్ష్మీనారాయణరెడ్డి, ఎర్నేని వెంకటరత్నంబాబు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, పశ్య పద్మ, సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ములకలపల్లి రాములు, సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా మాజీ కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ రామారావు, కోదాడ సీఐ రజితారెడ్డి, చిలుకూరు తహసీల్దార్ ధృవకుమార్, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు వేనేపల్లి వెంకటేశ్వరరావు, సీపీఐ మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నాగాటి రాములు తదితరులు నారాయణరావుకు నివాళులు అర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
సీపీఐ సీనియర్ నాయకులు దొడ్డ నారాయణరావు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES