– 55 రోజులపాటు కేవలం మంచి నీటిని తాగుతూ మృత్యువుతో పోరాడి ఓటమి
నవతెలంగాణ – బోనకల్
కేవలం 55 రోజులపాటు మంచినీటినే తాగుతూ మృత్యువతో పోరాడి చివరికి సీపీఐ(ఎం) సీనియర్ నాయకురాలు ఓడిపోయింది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలోని గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన సిపిఎం నాయకులు నల్లమోతు నాగేశ్వరరావు మాతృమూర్తి నల్లమోతు భద్రమ్మ (76) మృత్యువతో పోరాడి బుధవారం మృతి చెందింది. భద్రమ్మ సిపిఎం నిర్వహించే ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొనేది. సిపిఎం అంటే ఎంతో ప్రాణంగా భావించేది. గ్రామంలోనూ ఇతర ప్రాంతాలలోనూ సిపిఎం ఏ కార్యక్రమం నిర్వహించిన ఆ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొంటూ తన పాత్ర నిర్వహించేది. అదేవిధంగా తన కుమారులు కూడా సిపిఎం లోనే కొనసాగుతున్నారు.
భద్రమ్మ చిన్న కోడలు నల్లమోతు వాని సిపిఎం మహిళా శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆ విధంగా కుటుంబం మొత్తం సీపీఐ(ఎం)లో కొనసాగుతూ సిపిఎం నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ చురుకుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో భద్రమ్మ 55 రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆసుపత్రికి తీసుకెళ్తే వైద్యానికి ఆమె శరీరం పూర్తిగా స్పందించడం లేదని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో మరో మార్గం లేక కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువచ్చారు. అయితే 55 రోజుల నుంచి కేవలం ఆహార ఏమి తినటం లేదు. ప్రతిరోజు కుటుంబ సభ్యులు భద్రమ్మకు మంచినీళ్లు, టీ తాపిస్తున్నారు. ఈ విధంగా 55 రోజులు పాటు ప్రాణంతో ఉంది. చివరకు 56వ రోజున పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
మృతదేహాన్ని గోవిందాపురం ఎల్ గ్రామంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు, మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు జిల్లా కమిటీ సభ్యులు దొండపాటి నాగేశ్వరరావు జిల్లా సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, చింతలచెరువు కోటేశ్వరరావు, డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు పాపినేని రామ నరసయ్య, బోనకల్, మధిర రూరల్, మధిర టౌన్, ఎర్రుపాలెం మండలాల కార్యదర్శులు కిలారు సురేష్, మందా సైదులు, పడకంటి మురళి మద్దాల ప్రభాకర్ సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోవిందాపురం ఎల్ సర్పంచ్ మంద కరుణ ఉపసర్పంచ్ కారంగుల చంద్రయ్య, లక్ష్మీపురం సొసైటీ మాజీ అధ్యక్షులు మాదినేని వీరభద్రరావు మాజీ ఎంపీటీసీ జొన్నలగడ్డ సునీత సిపిఎం సీనియర్ నాయకులు ఏడునూతల లక్ష్మణరావు, మాజీ సర్పంచ్ కొమ్ము కమలమ్మ, సిపిఎం మండల కమిటీ సభ్యులు గుడ్డురి ఉమ, కేతినేని నాగేశ్వరరావు, పసుపులేటి నరేష్, శాఖా కార్యదర్శులు తమ్మారపు లక్ష్మణ్ రావు, కాట కోటయ్య, పొన్నం రాంబాబు, సిపిఎం నాయకులు కళ్యాణపు శ్రీనివాసరావు కళ్యాణపు, కళ్యాణపు బుచ్చయ్య, వల్లంకొండ సురేష్, గార్లపాడు సర్పంచ్ తాతా లక్ష్మీనారాయణ, మాదినేని లక్ష్మి తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.



