Saturday, July 19, 2025
E-PAPER
Homeసినిమామమ్మల్నిద్దర్నీ విడదీసేయండి..

మమ్మల్నిద్దర్నీ విడదీసేయండి..

- Advertisement -

హీరో విజయ్‌ సేతుపతి, నిత్యా మీనన్‌ జంటగా నటిస్తున్న రోమ్‌ కామ్‌ ఫ్యామిలీ డ్రామా ‘సార్‌ మేడమ్‌’. పాండిరాజ్‌ దర్శకత్వం దర్శకుడు. సత్యజ్యోతి ఫిలిమ్స్‌ బ్యానర్‌ పై సెందిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది.
తాజాగా మేకర్స్‌ ‘సార్‌ మేడమ్‌’ ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. ‘నాతో వస్తే లైఫ్‌ ఎలా ఉంటుందో ఆలోచించకుండా నేనే కావాలని వచ్చేశావు. మా అమ్మానాన్నే నన్ను ఇలా చూసుకోలేదని వాళ్ళే తిట్టుకునే విధంగా నిన్ను చూసుకుంటా’ అని విజయ్‌ సేతుపతి డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. విజరు సేతుపతి, నిత్యా మీనన్‌ మధ్య వచ్చే గొడవలు చాలా ఎంటర్టైనింగ్‌గా ఉన్నాయి. పెళ్లి చూపులు, పెళ్లి లాంటి బ్యూటీఫుల్‌ ఎమోషన్స్‌తో మొదలైన ట్రైలర్‌ ‘మమ్మల్నిద్దర్నీ విడదీసేయండి’ అని నిత్యామీనన్‌ చెప్పిన డైలాగ్‌తో ఊహించని మలుపు తీసుకోవడం ఆసక్తికరంగా ఉంది. పరోటా మాస్టర్‌గా విజయ్‌ సేతుపతి కనిపించిన సీన్స్‌ నవ్వులు పూయించాయి. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో మాస్‌ యాక్షన్‌ కూడా ఉండడం మరింత క్యూరియాసిటీని పెంచింది.
విజరు సేతుపతి మరోసారి తన సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. విజయ్‌ సేతుపతి, నిత్యామీనన్‌ కెమిస్ట్రీ స్పెషల్‌ హైలెట్‌గా నిలిచింది. డైరెక్టర్‌ పాండిరాజ్‌ హోల్‌సమ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అందించారని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. సంతోష్‌ నారాయణన్‌ అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ ఫన్‌, ఎమోషన్‌ని మరింతగా ఎలివేట్‌ చేసింది. డిఓపి ఎం.సుకుమార్‌ అందించిన విజువల్స్‌ బ్యూటీఫుల్‌గా ఉన్నాయి. ఫ్యామిలీ ఎమోషన్‌, ఫన్‌, రగ్గడ్‌ లవ్‌ స్టొరీ, మాస్‌ యాక్షన్‌తో చేసిన ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ సినిమా ఈనెల 25న థియేటర్లో విడుదల కానుంది అని మేకర్స్‌ చెప్పారు.
యోగి బాబు, సురేష్‌, చెంబన్‌ వినోద్‌ జోస్‌, శర్వణన్‌, దీప, జానకి సురేష్‌, రోషిణి హరిప్రియన్‌, మైనా నందిని తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి దర్శకత్వం: పాండిరాజ్‌, నిర్మాతలు: సెందిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, డిఓపి : ఎం సుకుమార్‌, ఎడిటర్‌: ప్రదీప్‌ ఇ రాఘవ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: వీర సమర్‌, కొరియోగ్రఫీ: బాబా భాస్కర్‌, స్టంట్‌: కలై కింగ్సన్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -