నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ జి ఈ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎస్ ఎల్ ఎస్ కన్వెన్షన్ హాల్లో సెప్టెంబర్ 1 జరిగే పెన్సన్ విద్రోహ దినంను పురస్కరించుకొని అన్ని ఉద్యోగ సంఘాల నాయకులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి హాజరై, మాట్లాడారు. సెప్టెంబర్ 1 జరిగే పెన్సన్ విద్రోహ దినంను పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 1000 మంది ఉద్యోగస్తులతో ముందు ఉద్యోగులు పెద్ద ఎత్తున సిపిఎస్ వ్యతిరేక దినోత్సవంను విజయవంతం చేయాలని కోరారు. సిపిఎస్ విధానం ఉద్యోగుల పాలిట శాపంగా మారిందని, సిపిఎస్ అంతం జేఏసీ పంతం నినాదంతో ఓల్డ్ పెన్షన్ సిస్టం ప్రకటించే వరకు ఉద్యోగ సంఘ నాయకులు మరియు ఉద్యోగస్తులందరు పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో టీజీవో జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్ ప్రసాద్, టీఎన్జీవో అధ్యక్షులు భగత్, సెక్రటరీ మహమ్మద్ కదీర్, పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు యాదయ్య, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు లక్ష్మి నర్సింహారెడ్డి, బోయ రాములు, శ్రీకాంత్, రేవెన్యూ ఫోరం, వెటర్నరీ ఫోరం శ్రీనివాస్న, నర్సింహా, గణగాని శశికాంత్ గౌడ్, అధ్యక్షలు, సిద్దేశ్వర్, పంచాయతీ సెక్రటరీ జిల్లా ఫోరం, శ్రీకాంత్ రెడ్డి, మిస్ట్రియల్ స్టాఫ్ అధ్యక్షలు, వినోద్ స్టాట్రస్టికల్ ఫోరం, కత్తుల కుమార్ మున్సిపల్ ఫోరం అధ్యక్షులు, శ్రీనివాస్, శుష్మ ల్యాండ్ రికార్డ్స్ ఫోరమ్, రిటైర్డ్ ఎంప్లొయ్ ఫోరం నుండి బాలేశ్వర్, అరుణ, బాలరాజు లు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం సన్నాహక సమావేశం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES