- Advertisement -
- ఆటోను ఢీకొట్టిన బొలెరో..
- పెండ్లి కొడుకు తండ్రి మృతి.. ఒకరికి గాయాలు
- విషాదంలో గ్రామాలు..
నవతెలంగాణ – తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ రోడ్డుపై ప్రమాదం సంభవించింది. తాడ్వాయి- కాటాపూర్ రోడ్డుపై మూల మలుపుల వద్ద నూతన పెండ్లి దంపతులు ప్రయాణిస్తున్న ఆటోను బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఆటోలు ప్రయాణిస్తున్న పెండ్లి కుమారుని తండ్రి మెదడు బయటికి వెళ్లి అక్కడికక్కడే మృతి చెందారు. బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన గోరంట్ల శ్రీను(45) తన కుమారుడు మహేష్ కు, అదే జిల్లా కరకగూడెం మండలం మోతే గ్రామానికి చెందిన “దీక్షిత” తో గత 6రోజుల క్రితం బుధవారం వివాహం జరిగింది. సోమవారం ఉదయమే వేములవాడ కు రాజరాజేశ్వర స్వామి దర్శనానికి పెండ్లి కుటుంబాల వారు ఆటోలో వెళుతున్నారు. అదే క్రమంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ మూల మలుపుల వద్ద, తాడ్వాయి నుండి స్పీడ్ గా వస్తున్న బొలెరో వాహనం పెండ్లి వారు వెళుతున్న ఆటోను ఢీ కొట్టింది. దీంతో పక్కకు కూర్చున్న పెండ్లి కుమారుని తండ్రి గోరంట్ల శ్రీను(45) మెదడు బయటికి వెళ్లి అక్కడికక్కడే మృతి చెందాడు. అతన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో పోలీసులు ఏటూర్ నాగారం ప్రభుత్వ హాస్పిటల్ కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా బొలెరో వాహనం పరారీలో ఉన్నట్టు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పెళ్ళికొడుకు గ్రామం గోపాలరావుపేట, పెళ్లికూతురు గ్రామం మోతే లో విషాదఛాయలనుకున్నాయి.
- Advertisement -