Sunday, February 15, 2026
E-PAPER
Homeజాతీయంజైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

జైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -

కార్గో లారీని ఢీకొట్టిన కారు
మహిళతో సహా ఐదుగురు మృతి
కారుడ్రైవర్‌ నిద్రమత్తే కారణమని అనుమానిస్తున్న పోలీసులు


జైపూర్‌: రాజస్థాన్‌లోని జైపూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కార్గో లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ కారులోని మహిళతో సహా ఐదుగురు మృతి చెందారు. కారు డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు చెందిన ఒక కుటుంబం తీర్థయాత్ర కోసం కారులో బయలుదేరింది. ఫిబ్రవరి 13న ఉజ్జయినీలోని మహాకాళేశ్వర్‌ ఆలయాన్ని వారు దర్శించారు.

ఆ తర్వాత రాజస్థాన్‌లోని ఖాతు శ్యామ్‌ జీ ఆలయానికి కారులో ప్రయాణమయ్యారు. కాగా, శనివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో కోట-జైపూర్‌ జాతీయ రహదారి 52పై ముందు వెళ్తున్న కార్గో లారీని ఆ కారు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఒకరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మరోవైపు మతులను రేష్మా శ్రీవాస్తవ, పియూష్‌ రారు, రాహుల్‌ రాజక్‌, షాను, డ్రైవర్‌ అనురాగ్‌గా పోలీసులు గుర్తించారు. మతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -