- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో బీజాపూర్ హైవేపై మొయినాబాద్ మండలం కనకమామిడి పరిధిలోని తాజ్ డ్రైవ్ ఇన్ సమీపంలో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
- Advertisement -



