ఇద్దరు యువకులు మృతి, ఒక్కరి పరిస్థితి విషమం..
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా మారిన సంఘటన మండల పరిధిలోని రుద్రారం గ్రామ పరిధిలోని చిగురుపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు పూర్తీ కథనం ప్రకారం.. మండలంలోని కిషన్ రావు పల్లి గ్రామానికి చెందిన ఇసుకమల్ల రాజ్ కుమార్ (22), బట్టు వంశీ, ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మహముత్తరం మండలం బోర్లగుడెం గ్రామానికి చెందిన వాంకుడోత్ వినోద్ తీవ్ర గాయలవడంతో భూపాలపల్లి ఆస్పత్రికి తరలించారు. అయితే అధిక వేగంతో వెళ్లడంతో ఈ ప్రమాదానికి దారితీసినట్లుగా తెలుస్తోంది. ఈ సంఘనపై కొయ్యుర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రుద్రారంలో ఘోర రోడ్డు ప్రమాదం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



