Saturday, December 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా సెర్ప్ సీఈఓ పుట్టినరోజు వేడుకలు 

ఘనంగా సెర్ప్ సీఈఓ పుట్టినరోజు వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్
సేర్ప్ సీఈఓ దివ్యదేవరాజన్ ఐఏఎస్ పుట్టినరోజు సందర్భంగా పేదలకు బియ్యం పండ్లు నిత్యవసరాల పంపిణీ చేశారు. తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఐకెపి సేర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ ఐఏఎస్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ సెర్ప్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్ స్థానిక సిబ్బంది ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల ఐకెపి కార్యాలయ ఆవరణలో తమ అధికారిని పుట్టినరోజు వేడుకలను ఆదర్శవంతంగా నిర్వహించారు. పుట్టినరోజు పేరుతో కేకులు బొకేలు ఫ్లెక్సీలకు డబ్బులు వృధా చేయకుండా పలువురు పేదలకు బియ్యం, పండ్లు నిత్యవసరాలకు కొంత నగదు అందజేశారు.

అయిదుగురు పేదలకు బియ్యము, పండ్లు అందజేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఒకపక్క సీఎంవో సెక్రటరీగా రికార్డ్ స్థాయిలో సిఎంఆర్ఎఫ్ నిధులను పేదల వైద్య ఖర్చులకు అందించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కీలకపాత్ర పోషించడంతోపాటు , గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సేర్ప్ సీఈఓ గా మహిళా శక్తి కార్యక్రమాలను ఆదర్శవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు.

ఆదిలాబాద్ లో జిల్లా కలెక్టర్గా గిరిజనులకు తను అందించిన సేవలకు ఒక తాండాకు దివ్యగూడం అన్న పేరును సైతం దివ్య దేవరాజన్ ఐఏఎస్ పేరున మీదుగా ఏర్పాటు చేశారని అన్నారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉండి కూడా సిబ్బందికి అమూల్యమైన సమయం కేటాయిస్తూ వారి సమస్యలను పరిష్కరించడంతో విధి నిర్వహణలోనూ ఆదర్శవంతంగా నిర్వహిస్తున్నారని అలాంటి అధికారిని పుట్టినరోజును ఆదర్శవంతంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని గంగాధర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐకెపి సీనియర్ సిసిలు కుంట శ్రీనివాస్ పురాస్తు నరేష్, ఈజిఎస్ ఏపీవో నర్సయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -