Tuesday, March 24, 2026
E-PAPER
Homeఖమ్మంనాణ్యమైన భోజనం వడ్డించాలి

నాణ్యమైన భోజనం వడ్డించాలి

- Advertisement -

– విద్యార్థుల అభ్యాసంపై ప్రత్యేక దృష్టి సారించాలి
– కాంప్లెక్సు హెచ్ ఎం ఎస్. వెంకటేశ్వరరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నాణ్యంగా, శుభ్రతతో వడ్డించాలని నారాయణపురం కాంప్లెక్స్ హెచ్‌ఎం ఎస్‌. వెంకటేశ్వరరావు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. మంగళవారం ఆయన కాంప్లెక్స్ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నారాయణపురం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి వంటశాల పరిశుభ్రత, ఆహార నాణ్యత గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులతో మాట్లాడి భోజనం నాణ్యతపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.

అనంతరం తరగతి గదులను సందర్శించి విద్యార్థుల చదువు స్థాయిని పరీక్షించారు.చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు.ప్రతి విద్యార్థి ప్రగతిపై ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులు చలమారావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -