గ్రూప్-1 ద్వారా ఎంపికైన డిప్యూటీ కలెక్టర్లకు
జేఏసీ చైర్మెన్ లచ్చిరెడ్డి పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విధి నిర్వహణలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా..నిబద్దతతో ప్రజలకు సేవ చేయాలని గ్రూప్-1 ద్వారా ఎంపికైన డిప్యూటీ కలెక్టర్లకు తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మెన్ వి. లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. కొత్తగా ఎంపికైన అభ్యర్థులు శుక్రవారం హైదరాబాద్‌లోని కమిషనర్ ఆప్ ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ)లో ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విభాగాలన్నింటిలో రెవెన్యూ శాఖ ముఖ్యమైనదనీ, విద్యార్థుల సర్టిఫికెట్లనుంచి మొదలుకుని భూ సమస్యల వరకు అన్నింటికి జవాబుదారిగా ఉంటుందని చెప్పారు. ప్రజలు ఈ శాఖపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా సేవలందించాలని కోరారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరుతేవాలని సూచించారు. రెవెన్యూ శాఖ ప్రాముఖ్యతతో పాటు పౌర సమాజానికి సేవ చేసేందుకు ఉన్న అవకాశాలపై ఈ సందర్భంగా ఆయన వారికి అవగాహన కల్పించారు.
నిబద్దతతో ప్రజలకు సేవ చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES