Thursday, October 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసర్వర్‌ ఎఫెక్ట్‌.. నిలిచిన ఆర్టీఏ సేవలు

సర్వర్‌ ఎఫెక్ట్‌.. నిలిచిన ఆర్టీఏ సేవలు

- Advertisement -

– ఆ స్లాట్‌లకు నేడు యథావిధిగా సేవలు
నవతెలంగాణ – సిటీబ్యూరో

రవాణాశాఖలో మరో సారి సర్వర్‌ డౌన్‌ కావ డంతో బుధవారం వెహికల్‌ రిజిస్ట్రేషన్లు, ఇతర వాహన సేవలకు సంబంధించిన లావాదేవీలు పూర్తిగా స్తంభించాయి. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని ఆ శాఖ కేంద్ర కార్యాలయంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా సర్వర్‌ డౌన్‌ అయిపోయింది. ఉదయం నుంచే సేవలు నిలిచిపోయాయి. ఫలితంగా బుధవారం గ్రేటర్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 54 ఆర్టీఏ కార్యాలయాల్లో వాహన సేవలకు ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సేవలందక వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. బుధవారం స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి గురువారం యథావిధిగా సేవలు అందించనున్నట్టు తెలిపారు. ఇదిలావుంటే సారథి పరివాహన్‌లో అందిస్తున్న లర్నింగ్‌ లైసెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తదితర సంబంధిత సేవలకు ఎలాంటి ఆటంకం ఏర్పడకపోగా.. యథావిధిగా సేవలు కొనసాగాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -