Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తండ్రి పేరు పై సేవలు ఆదర్శనీయం..

తండ్రి పేరు పై సేవలు ఆదర్శనీయం..

- Advertisement -

స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్
నవతెలంగాణ – ఆర్మూర్  

తల్లి లేని లోటును తీరుస్తూ కష్టపడి గొప్ప వాళ్ళను చేసిన తండ్రిని మరిచి పోకుండా ఆయన పేరు పై ఇప్పటికి సేవా కార్యక్రమాలు చేపడుతున్న పోలీసు సోదరులను నేటి తరం ఆదర్శంగాతీసుకోవాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్  సత్య నారాయణ గౌడ్ అన్నారు.  మండలం  లో నీ చేపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శుక్రవారం గ్రామానికి చెందిన మీనుగు లక్ష్మన్న వర్ధంతిని పురస్కరించుకొని ఆయన తనయులు పెద్ద కుమారుడు డీఎస్పీ రాజ గంగారం, చిన్న కుమారుడు పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ లు  సుమారు 35 వెయ్యిల రూపాయల విలువగల టీ షర్టులను విద్యార్థులకు అందజేసినారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  హాజరై మాట్లాడుతూ పిల్లలు చిరుప్రాయంలో ఉండగానే మీణుగు లస్మన్న  సతీమణి  పోసాని లోకం విడిచి వెళ్లిపోయిందనీ,. కీర్తిశేషులు లస్మన్న పిల్లలే తన సర్వస్వంగా మరో వివాహం చేసుకోకుండా కష్టపడి చదివించి వారిని గొప్పవారిని చేశారన్నారు. ఈరోజు డిఎస్పి హోదాలో ఉన్న పెద్ద కుమారుడు, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉన్న చిన్న కుమారుడు తండ్రి త్యాగాన్ని మరవకుండా ఆయన పేరుపై సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. 

ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు చేతన కుమారి, పెర్కిట్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు చంద్రకళ. గీతాంజలి తాజా మాజీ సర్పంచ్ ఇందుర్ సాయన్న. సమాజ సేవకుడు గడ్డమీది లింగం గౌడ్. మాజీ ఎంపీటీసీ జన్నెపల్లి గంగాధర్. వీడీసీ అధ్యక్షుడు సారంగి శ్రీకాంత్ మాజీ ఉపసర్పంచ్ డిష్ రాజు. బీజేవైఎం మండల అధ్యక్షుడు సతీష్ (బబ్లు)డాక్టర్ శంకర్ దాస్. చిట్యాల పోశెట్టి. గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -