తహశీల్దార్ జిపిఓల వినతి
నవతెలంగాణ – మల్హర్ రావు
తాము విధుల్లోకి చేరి రెండు సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో సర్వీస్ ప్రొబేషన్ డిక్లరేషన్ చేయాలని మండల జిపిఓ సంఘం ఆధ్వర్యంలో సోమవారం మండల తహశీల్దార్ రవికుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు,భూపాలపల్లి జిల్లా లోని అన్ని మండల కేంద్రాల్లో, జిపిఓలుగా విధుల నిర్వహిస్తున్న తాము, గతంలో పూర్వ విఆర్ఏలుగా జీవో నెంబర్ 81 ద్వారా పదోన్నతి పొందిన ప్రస్తుత (డైరెక్ట్ రిక్రూట్ మెంట్- జిపిఓలుగా) పదోన్నతి పొందిన ఉద్యోగానికి సంబంధించిన ఆర్డర్ కాపీ జూనియర్ సహాయకులుగా,రికార్డ్ అసిస్టెంట్ గా,లాస్ట్ గ్రేడ్ సర్వీస్ లుగా గతంలో నిర్వహించడం జరిగిందన్నారు.
కావున రెండు సంవత్సరాలు అయిపొయినందున మాకు సర్వీస్ ప్రొబేషన్ డిక్లరేషన్ చేయాలనీ కోరుతున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలన అసోసియేషన్ జిల్లా మహిళ అధ్యక్షురాలు సిహెచ్. స్వర్ణలత,ఉపాధ్యక్షులు ఎం.రాజు, జనరల్ సెక్రటరీ గొట్టం నరేష్, సిహెచ్ రాజు,ఎం రాజేందర్ పాల్గొన్నారు.



