నవతెలంగాణ – కంఠేశ్వర్ : లయనిజంలోకి కొత్త వారిని తీసుకురావడం ద్వారా సేవా కార్యక్రమాలను మరింత విసృతం చేయాలని లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ పి.లక్ష్మి ఉద్బోదించారు. లయన్ సభ్యులు నూతన సభ్యత్వంపై దృష్టి సారించాలని ఆమె సూచించారు. లయన్స్ ఇంటర్నేషనల్ నిజామాబాదు రీజియన్ అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారుల సమావేశం శనివారం రాత్రి నిజామాబాదు నగరంలోని సందీప్ గార్డెన్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ పి.లక్ష్మి ముఖ్యాతిధిగా హాజరయ్యారు. నిజామాబాదు రీజియన్ చైర్మెన్ ఉదయ సూర్యభగవాన్ సంపాదకత్వంలో ముద్రించిన లయన్స్ సమాచార దర్శిని మాస పత్రికను పూర్వ గవర్నర్ లక్ష్మి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల ఒకటిన శుభారంభ్ పేరిట నిజామాబాదు రీజియన్ పరిదిలో ఒకే రోజు 85 సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.సేవా కార్యక్రమాల సమాచారం కోసం నెలవారీ సమాచార దర్శినిని ముద్రించడం గొప్ప విషయమని అన్నారు..మత్తు పదార్థాల గురించి అవగాహన కల్పించేందుకు లయన్స్ జిల్లా యాంటీ డ్రగ్స్ చైర్మెన్ జిల్కర్ విజయానంద్ రూపొందించిన స్టిక్కర్లు, బ్యానర్లు,బ్యాడ్జీలను ఈ సందర్భంగా లక్ష్మి ఆవిష్కరించారు.. లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్లు డి.పెంటయ్య,ఇరుకుల వీరేశం,జిల్లా అదనపు కోశాధికారి పి.లక్ష్మినారాయణ,రీజియన్ చైర్మెన్ ఉదయ సూర్యభగవాన్,రీజియన్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు,రీజియన్ పీఆర్వో చింతల గంగాదాస్,జోన్ చైర్మెన్లు దారం భూమన్న,కాలేరుఅవన్ కుమార్,బొబ్బ నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.
సేవ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలి
- Advertisement -
- Advertisement -