Monday, March 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపట్టణాల్లో సేవలు.. గ్రామాల్లో వ్యవసాయం

పట్టణాల్లో సేవలు.. గ్రామాల్లో వ్యవసాయం

- Advertisement -

మెజార్టీ ప్రజలకు ఉపాధి చూపిస్తున్న రంగాలు
రెండో స్థానంలో ఇండస్ట్రియల్ సెక్టార్‌
2026-27 తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ పట్టణాల్లో సేవల రంగం, గ్రామాల్లో వ్యవసాయ రంగాలు మెజార్టీ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నాయి. జాతీయ స్థాయిలో రంగాల వారీగా ఉపాధి పంపిణీని పోల్చి చూసినప్పుడు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలున్నాయని 2026-27 తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) 2026 అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసిక నివేదిక ప్రకారం, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం 62.6శాతం ఉపాధిని అందిస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో సేవల రంగం 64.9 శాతం ఉపాధి కల్పిస్తోంది.

వ్యవసాయ రంగంలో ఇది జాతీయ సగటు కంటే 4 శాతం ఎక్కువ. అదే సేవా రంగంలో జాతీయ సగటు కంటే 3 శాతం అదనంగా ఉంది. అయితే పారిశ్రామిక రంగంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన విషయంలో జాతీయ సగటు కంటే తెలంగాణ సగటు తక్కువగా ఉంది. పారిశ్రామిక రంగంలో గ్రామీణ ప్రాంతాల్లో 17.7 శాతం ఉపాధి కల్పిస్తుంగా, పట్టణ ప్రాంతాల్లో 30.2 శాతంగా ఉంది. ఈ విషయంలో జాతీయ సగటు 20.9 శాతం, 31.5 శాతంగా ఉంది. ఓవరాల్‌ వర్కర్‌ పాపులేషన్‌ సగటు (డబ్ల్యూఆర్‌) తెలంగాణలో 57 శాతం కాగా, ఇండియాలో 53.1 శాతంగా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -