మెక్సికన్ ఎయిర్‌లైన్స్ వివరణ
మెక్సికో సిటీ : క్యూబాకు షెడ్యూల్ ప్రకారం విమాన సర్వీ సులు కొనసాగుతాయని మెక్సికన్ ఎయిర్‌లైన్స్ సోమవారం ప్రకటిం చింది. రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు నిలిపివేయలేదని మెక్సి కోలో క్యూబా రాయబారి యుజెనియో మార్టినెజ్ ఎన్రిక్వెజ్ పేర్కొన్నారు. ”మెక్సికో నుండి క్యూబాకు విమాన సర్వీసులు నిలిపివేయలేదు. క్యూబాకు అనుసంధానంగా ఉన్న అన్ని విమానయాన సంస్థలు తమ విమానాలను షెడ్యూల్ ప్రకారం కొనసాగిస్తాయని ధృవీకరిస్తున్నాము” అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. క్యూబా ప్రభుత్వం ఆదివారం అంతర్జాతీయ విమానయాన సంస్థలకు నోటీసు (నోటమ్) జారీ చేసిన అనంతరం ఈ పకటన వెలువడింది. యుఎస్ ‘చమురు ముట్టడి’ కారణంగా ఫిబ్రవరి 10 నుంచి క్యూబా విమానాశ్రయాలలో విమాన ఇంధనం ఖాళీ అయిందని నోటీసులో పేర్కొంది. దీంతో నెలరోజుల పాటు మార్చి11వ తేదీవరకు దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు ప్రభావితం కానున్నాయని తెలిపింది. నోటీసుకు ప్రతిస్పందనగా, విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి అత్యవసర చర్యలను చేపట్టాయి. తన విమానం రౌండ్-ట్రిప్ సర్వీసును పూర్తి చేయడానికి తగినంత ఇంధనాన్ని తీసుకుని మెక్సికో నుండి విమానం బయలుదేరుతుందని వివా ఏరోబస్ ప్రకటించింది.
క్యూబాకు సర్వీసులు నిలిపివేయలేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



