No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeజిల్లాలుకాటారంలో మినీ స్టేడియం ఏర్పాటు చేయండి..

కాటారంలో మినీ స్టేడియం ఏర్పాటు చేయండి..

- Advertisement -

సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ కు వినతి పత్రం అందజేత
నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం)
: కాటారం మండల కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని కాటారం సబ్ కలెక్టర్ మహాంక్ సింగ్ కు డివైఏప్ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్ వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కాటారం శివారులోని ఊర చెరువును ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో సర్వే నెంబర్ 71లో మినీ స్టేడియంను ఏర్పాటు చేయాలన్నారు.గత ప్రభుత్వంలో మినీ స్టేడియం కోసం రూ. 30 లక్షలు ఖర్చు చేసి యువకులను క్రీడలకు ప్రోత్సహించే విధంగా గంజాయి డ్రగ్స్ మహమ్మారి నుండి దూరం చేసేందుకు క్రీడల్ని బలపరిచేందుకు యువకులకు ఉపయోగపడే విధంగా మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేయాలని వచ్చిన రూ.30 లక్షలు నిరాధారంగా నిలిచిపోతున్నాయన్నారు. గత ప్రభుత్వం కాటారం శివారులోని 49 సర్వే నెంబరు తిమ్మనుకుంటలో ఏర్పాటు చేస్తానని ఆర్భాటాలు సృష్టించి ఇప్పటివరకు మినీ స్టేడియాన్ని కలగా మిగిల్చారన్నారు. ఇప్పుడైనా త్వరగాదిన ఆ స్థలం కబ్జాకు గురికాకముందే కాటారం మండల కేంద్రంగా యువకులకు ఉపయోగపడే విధంగా క్రీడాభివృద్ధి జరిగే విధంగా ఆ స్థలంలో మినీ స్టేడియం ను ఏర్పాటు చేయాలని విన్నవించినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బొడ్డు రాజ్ కుమార్ ,రైతు సంఘం నాయకులు గుమ్మడి తిరుపతి పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad