– టీపీసీసీ చీఫ్‌కు మల్లు రవి లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య పంచాయితీ, అనంతరం జరిగిన పరిణామాలపై పార్టీ సీనియర్ నేతలతో ప్రత్యేక కమిటీ వేయాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మెన్ మల్లు రవి కోరారు. ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు లేఖ రాశారు. ఆ కమిటీ సభ్యులు ఆ జిల్లాకు వెళ్లి విచారణ జరుపుతారని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. పలు జిల్లాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై చర్చించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొండా మురళి రెండు దఫాలుగా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వచ్చే వారం చర్చిస్తామన్నారు. రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ తనతో మాట్లాడారని తెలిపారు. ఈ విషయమై సుదీర్ఘంగా చర్చించినట్టు చెప్పారు. సమస్య రిపీట్ కాకుండా ఒకసారి చెప్పి చూస్తామనీ, తిరిగి పునరావృత్తమైతే ఆయనపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. మంత్రి పదవి విషయంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై పార్టీ నిశితంగా పరిశీలన చేస్తున్నట్టు ఆయన వివరించారు.
వరంగల్ పంచాయితీపై ప్రత్యేక కమిటీ వేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES