ఆయన నియమించిన యూఎస్ అటార్నీని పదవి నుంచి తప్పించిన కోర్టు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు అక్కడి కోర్టులో చుక్కెదురైంది. పలు క్రిమినల్ కేసులను పర్యవేక్షించడం కోసం ట్రంప్ నియమించిన యూఎస్ అటార్నీనిని కోర్టు పదవీ నుంచి తప్పించింది. అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో యాక్టింగ్ యూఎస్ అటార్నీగా బిల్ ఎస్సైలీ పని చేస్తున్నారు. అయితే ఎస్సైలీ చట్టపరమైన కాలపరిమితి (120 రోజులు) దాటిన తర్వాత కూడా తాత్కాలిక హౌదాలో కొనసాగడం అన్యాయమని ఫెడరల్ జడ్జి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జె.మైఖేల్ సీబ్రైట్.. మూడు కేసుల్లో క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుంచి బిల్ ఎస్సైలీని తప్పించాలని ఆదేశించారు. అమెరికా చట్టం ప్రకారం ఒక యాక్టింగ్ యూఎస్ అటార్నీకి నాలుగు నెలల లోపల శాశ్వత నియామకం జరగాలి. ఆ గడువు ముగిసిన తర్వాత
ప్రెసిడెంట్.. సెనేట్ అనుమతి పొందాలి. లేకపోతే కోర్టు తాత్కాలిక నియామకాన్ని జరుపుతుంది. ఎస్సైలీ ఈ ఏడాది జులై 29 నాటికి రాజీనామా చేసినప్పటికీ..
సెనేట్ దానిని ధృవీకరించలేదు. అయినప్పటికీ ఆయన ఆ పదవిలో కొనసాగారనీ, ఇది అన్యాయమని కోర్టు గుర్తించింది. కాగా తాజా పరిణామాన్ని ట్రంప్ ప్రభుత్వానికి మరో ప్రమాద సూచికగా పరిశీలకులు చెప్తున్నారు.
ట్రంప్‌నకు ఎదురుదెబ్బ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



