Wednesday, March 11, 2026
E-PAPER
Homeజాతీయంకేరళ హైకోర్టులో యూడీఎఫ్‌కు ఎదురుదెబ్బ

కేరళ హైకోర్టులో యూడీఎఫ్‌కు ఎదురుదెబ్బ

- Advertisement -

ఆ సందేశాలు డేటా ఉల్లంఘన కిందకు రావని స్పష్టీకరణ
సమర్ధవంతమైన పాలనలో భాగమేనంటూ కోర్టు వ్యాఖ్యలు

తిరువనంతపురం : ప్రతిపక్ష నేత వి.డి.సతీశన్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితాల నేతృత్వంలోని ప్రతిపక్షాలకు కేరళ హైకోర్టు తాజా చర్యతో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. స్పార్క్‌ (సర్వీస్‌ పేరోల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ రిపాజిటరీ ఫర్‌ కేరళ) నుంచి అక్రమంగా తీసుకున్న ఫోన్‌ నెంబర్లకు పెద్ద మొత్తంలో సందేశాలు పంపడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయమూర్తుల గోప్యతను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందంటూ ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌ను కేరళ హైకోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు వ్యాఖ్యలు చేస్తుందని వారు భావించారు కానీ కోర్టు అందుకు వ్యతిరేకంగా స్పందించింది. సుపరిపాలనలో భాగంగానే ఈ సందేశాలు పంపుతున్నారని వ్యాఖ్యానించింది. ప్రతిపక్షానికి కోర్టు నుండి ఎదురవుతున్న వరుస ఎదురు దెబ్బల్లో ఇది తాజాది, అత్యంత తీవ్రమైనది కూడా. జస్టిస్‌ బెచూ కురియన్‌ థామస్‌ బహిరంగ కోర్టులో ఈ విషయాన్ని ప్రకటించారు.

”సామాజిక సంక్షేమ ప్రభుత్వంలో సుపరిపాలనతో సహా చట్టబద్ధమైన ప్రయోజనాల కోసం, సేకరించిన డేటాను గోప్యతా చట్టాలను ఉల్లంఘించకుండా వినియోగించుకోవచ్చు. కేఎస్‌ఐ టీఎం కేరళ ప్రభుత్వంలో భాగమైనందున, తమ వద్దనున్న డేటాను ఉపయోగించి కేఎస్‌ఐటీఎం పేరుతో నమోదైన వాట్సాప్‌ ఖాతా ద్వారా అ సందేశాలు పంపుతున్నారు. ఆ సందేశాల స్వభావం ఎలాంటి చట్టవిరుద్ధమైన ప్రయోజనాలకు ఉద్దేశించి కాదు..అయితే ఆ డేటాను చట్టబద్ధమైన ప్రయోజనాలకే ఉపయోగిస్తారా లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ..ఏ డేటా కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి బదిలీ అయినట్టుగా ఎలాంటి సమాచారం సూచించడం లేదని…లేదా, ముఖ్యమంత్రి లేదా ఆయన కార్యాలయం ఈ డేటాను ఉపయోగించి ఏ చర్యలైనా తీసుకున్నారని నిర్ధారించేలా ఎటువంటి వివరాలు అందుబాటులో కూడా లేవు.. అందువల్ల ఈ రిట్‌ పిటిషన్‌ విచారణకు అర్హమైనది కాదు.” అని పేర్కొన్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయ స్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో ప్రతిపక్షం ఇప్పుడు దయనీయమైన పరిస్థితుల్లో పడింది. అయితే ప్రభుత్వ చర్యలను మాత్రం ధృవీకరించింది. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ప్రతి అంశంలోనూ ప్రతిపక్షానికి ఎదురుదెబ్బలు తప్పడం లేదనే వాస్తవాన్ని దృష్టిలో వుంచుకుంటే ఈ ఎదురుదెబ్బ ప్రభావం మరింత పెరిగింది. గత పదేండ్లుగా, ప్రతిపక్షానికి ఇది పదే పదే పునరావృతమవుతూనే వస్తోంది. ప్రతిపక్షం యొక్క ‘ఉత్సాహక కమిటీలు’ గా వ్యవహరించే మీడియా ప్రతిసారీ ప్రచురించే తప్పుడు, అసత్య వార్తలను ఉపయోగించుకుని ప్రతిపక్షం వాటి ప్రాతిపదికన కోర్టును ఆశ్రయించడం జరుగుతోంది.

ఎఐ కెమెరాస్‌, స్ప్రింక్లర్‌, కె-ఫాన్‌, పీపీఈ కిట్స్‌, నవకేరళ సదాస్‌లతో సహా ప్రభుత్వం చేపట్టిన పలు ప్రముఖ ప్రాజెక్టులన్నింటి లోనూ ఇదే ధోరణి కనిపించింది. కోర్టును ఆశ్రయించడం ద్వారా ఈ ప్రాజెక్టులన్నింటినీ స్తంభింపచేయాలన్నది వారి లక్ష్యంగా వుంది. కానీ, ఈ కేసులన్నింటిలో కూడా ప్రతిపక్షం తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలించుకుంది. ఒకానొక దశలో, ఈ తీసుకుంటున్న చర్య లేదా దాని వెనుక ఉద్దేశ్యం ”ప్రజా ప్రయోజనాల కోసమా” లేక ప్రచార ప్రయోజనాల కోసమా” అని స్వయంగా ప్రతిపక్ష నేతను కోర్టు ప్రశ్నించింది. ఇంత జరిగినా, వారు తమ అలవాట్లను మార్చుకోవడానికి తిరస్కరించారు. అంతిమంగా, ప్రభుత్వ వ్యవస్థ – డిఎతో సహా ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలను తెలియచేసే వ్యవస్థ -ద్వారా పంపే ఫోన్‌ సందేశాలకు సంబంధించి డేటా ఉల్లంఘన జరిగిందంటున్న పిటిషన్‌ను తోసిపుచ్చింది.

ఇందులో ఎలాంటి చట్ట విరుద్ధత లేదా డేటా ఉల్లంఘన లేదని కోర్టు నిర్ధారించింది. పైగా, ఇటువంటి చర్యలు సమర్ధవంతమైన పాలనా నిర్వహణాలో భాగమని వ్యాఖ్యలు కూడా చేసింది. ఏళ్ళ తరబడి ప్రజల ఫోన్లకు ప్రధాని నరేంద్ర మోడీ తరచుగా సందేశాలు పంపుతున్న అంశం ఇక్కడ గమనించాల్సి వుంది. కొన్నిసార్లు ఎన్నికల ప్రచారానికి కూడా తప్పుడు వివరాలతో కూడిన సందేశాలు వస్తూంటాయి. ఊమెన్‌ చాందీ ప్రభుత్వ హయాంలో, ప్రైవేటు కంపెనీ ద్వారా ప్రజల ఫోన్లకు సందేశాలు పంపేవారు. ఆ సమయంలో యుడిఎఫ్‌ కానీ ఈ మీడియా సంస్థలు గానీ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడం ఆసక్తికరమైన అంశం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -