Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంగొప్పగా స్థిరపడి తల్లిదండ్రులకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలి

గొప్పగా స్థిరపడి తల్లిదండ్రులకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలి

- Advertisement -

జేఎన్టీయూహెచ్‌ రెక్టార్‌ విజయ్‌కుమార్‌రెడ్డి
హోలిమేరి ఇంజినీరింగ్‌ కాలేజీలో ఘనంగా గ్రాడ్యుయేషన్‌ డే


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీటెక్‌ పూర్తయిన విద్యార్థులు జీవితంలో గొప్పస్థాయికి ఎదిగి జీవితంలో స్థిరపడి తల్లిదండ్రులకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని జేఎన్టీయూహెచ్‌ రెక్టార్‌ కె విజయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇంజినీరింగ్‌ చదివిన పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఎన్నో ఆశలుంటాయని చెప్పారు. తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలని సూచించారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం బోగారంలోని హోలిమేరి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ కాలేజీలో సోమవారం గ్రాడ్యుయేషన్‌ డే ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన విజయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ బీటెక్‌ పూర్తయ్యాక కొందరు ఉన్నత చదువులకు వెళ్తారనీ, మరికొందరు విదేశాలకు వెళ్తారనీ, ఇంకొందరు ఉద్యోగాలు చేస్తారని చెప్పారు. గ్రాడ్యుయేషన్‌ తర్వాత ఏం చేయాలో, ఎక్కడ ప్రారంభించాలో ఆలోచించాలని సూచించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారాలని కోరారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలనీ, దాన్ని సాధించేందుకు కష్టపడాలని చెప్పారు. బంధువులు, ఇతరుల ముందు తల్లిదండ్రులు తలదించుకునేలా చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఇంజినీరింగ్‌ పూర్తయినా ఏమీ చేయకుంటే వారు ఎక్కువగా ఆలోచించి సమయానికి తిండి తినబోరనీ, నిద్ర ఉండబోదని అన్నారు. దాని వల్ల వారికి బీపీ, షుగర్‌ వంటివి వస్తాయనీ, ఇవి రిటర్న్‌ గిఫ్ట్‌గా ఇస్తారా?అని ప్రశ్నించారు. వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. జూనియర్లకు ఆదర్శంగా నివాలని సూచించారు. నైతిక విలువలు పాటించాలని కోరారు. 2021-25 విద్యాసంవత్సరాల వరకు 286 మంది విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హోలిమేరి కాలేజీ చైర్మెన్‌ సిద్ధార్థరెడ్డి, కార్యదర్శి ఎ వరప్రసాద్‌రెడ్డి, వ్యవస్థాపక కార్యదర్శి ఎ విజయశారదరెడ్డి, ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad